Header Banner

పవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. జగన్ ఏమన్నారంటే..?

  Tue Apr 08, 2025 14:24        Politics

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగ‌పూర్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించిన ఆయ‌న బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. "సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని జ‌గ‌న్ ఎక్స్ పోస్టు(X post)లో రాసుకొచ్చారు. ఇక ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై మంత్రి నారా లోకేశ్‌, మాజీ మంత్రి కేటీఆర్, చిరంజీవి త‌దిత‌రులు స్పందించారు. ప‌వ‌న్ కుమారుడు గాయ‌ప‌డ‌డం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli